మెగా హీరోలపై కన్ను ?

Friday,September 30,2016 - 05:08 by Z_CLU

వరుసగా రెండు హిట్స్ అందుకున్నాడు. రెండూ క్లీన్ విజయాలు. సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ సినిమాలే. రెండు సక్సెస్ లు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ఏ దర్శకుడైనా  చూసేది ఒకేవైపు. సో.. దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కూడా మెగా కాంపౌండ్ వైపే చూస్తున్నాడు. కుదిరితే తన మూడో సినిమాను మెగా హీరోల్లో ఒకరితో చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కాంపౌండ్ నుంచి కాల్ అయితే వచ్చింది, కానీ అవసరాలకు షాక్ కూడా తగిలింది.

avasarala-niharika

     అవును… మెగా హీరోతో సినిమా చేద్దామనుకున్న అవసరాలకు మెగా హీరోయిన్ నుంచి ఆఫర్ వచ్చిందట. కొణెదల నిహారికతో సినిమా చేయమని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నుంచి అవసరాలకు కాల్ వచ్చిందట. మెగా కాంపౌండ్ నుంచి కాల్ వచ్చినందుకు సంతోషించాలో… హీరోను కాకుండా హీరోయిన్ ను అప్పజెప్పినందుకు బాధపడాలో అర్థంకాని స్థితిలో పడిపోయాడట అవసరాల.