చాలా బిజీ అంటున్న అవసరాల...

Saturday,December 10,2016 - 12:00 by Z_CLU

అవసరాల శ్రీనివాస్ హీరోగా మిస్తీ చక్రవర్తి , తేజస్వి మదివాడ , సుప్రియ, శ్రీముఖి హీరోయిన్స్ గా నూతన దర్శకుడు నవీన్ మేడారం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కు ‘బాబు బాగా బిజీ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు యూనిట్. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘హంటర్’ కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.

avasarala-babu-baga-buzy

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫుల్లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఫస్ట్ సీన్ నుండి ఎండ్ సీన్ వరకూ అందరినీ ఎంటర్టైన్ చేయడం గ్యారెంటీ అంటున్నారు యూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో ను డిసెంబర్ లో రిలీజ్ చేసి త్వరలోనే సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.