ఇంకా ఖరారు చెయ్యలేదు -రామ్ చరణ్

Saturday,July 16,2016 - 06:38 by Z_CLU

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా గా తన పేస్ బుక్ అకౌంట్ లో లైవ్ చాట్ ద్వారా తమ అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తో పాటు తన సినిమా ‘ధ్రువ’ గురించి అలాగే తాను నిర్మిస్తున్న చిరు 150 సినిమా గురించి కొన్ని విశేషాలు తెలియజేసారు.
ఇక మహేష్ చాలా అందంగా ఉంటాడని మంచి వ్యక్తిత్వం కలవాడని మరో సారి మహేష్ పై మాట్లాడాడు చెర్రీ . అలాగే ప్రభాస్ తనకు మంచి స్నేహితుడని ఇటీవలే ‘బాహుబలి’ షూటింగ్ కి వెళ్లి కలిశానని చెప్పుకొచ్చాడు., ఇక బాబాయ్ పవన్ కళ్యాణ్ నిర్మాణం లో హీరో గా నటించే సినిమా వచ్చే ఏడాది ఉంటుందని ఇందుకు కథ సిద్ధం అవుతుందని తెలియజేసాడు. ఇక చిరు సినిమాకు ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ ఇంకా ఖరారు కాలేదని త్వరలోనే టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తామని, ఇక ఈ చిత్రం లో తాను నటించే విషయం పై కూడా నోరు విప్పాడు చరణ్. ప్రస్తుతానికి నేను నటించడానికి స్కోప్ లేదని ఒక వేళ నాన్న, వినాయక్ గారు ఏదైనా సన్నివేశం లో కానీ, పాట లో కానీ ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా మరో సారి నాన్న తో నటించాలని ఉందని చెప్పాడు రామ్ చరణ్. ప్రస్తుతం తాను కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో నటిస్తున్న చిత్రం ‘ధ్రువ’ ఫస్ట్ లుక్ ను ఆగస్టు 15 న విడుదల చేయనున్నట్లు తెలిపాడు.