చైతు సరసన రకుల్ ?

Saturday,July 16,2016 - 10:09 by Z_CLU

 

నాగ చైతన్య కథానాయకుడిగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో త్వరలోనే ఓ సినిమా రూపొందనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కనున్న చిత్రం లో కథానాయికగా రకుల్ ఫైనల్ అయ్యిందనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఇక మొన్న సంక్రాంతి కి నాగార్జున తో’ సోగ్గాడే చిన్ని నాయనా’ అంటూ గ్రాండ్ హిట్ అందుకున్న యువ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రం కోసం ఇప్పటికే కథ ను కూడా సిద్ధం చేసారని సమాచారం. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘కళ్యాణం’ అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారట యూనిట్. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమాకు ముందుగా సమంత ను కథానాయిక గా అనుకోని కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం ఆ ప్లేస్ లో రకుల్ ను ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఈ విషయం పై త్వరలోనే అఫీషియల్ న్యూస్ రానున్నట్టు సమాచారం.