బన్నీ కోసం ప్రేక్షకులు వెయిటింగ్

Saturday,November 10,2018 - 11:10 by Z_CLU

బన్నీని మరోసారి స్టేజ్ పై చూసేందుకు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపు సాయంత్రం జరగనున్న టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా హాజరుకాబోతున్నాడు. ఈ ఈవెంట్ ను జీ సినిమాలు ఛానెల్, జీ సినిమాలు హెడ్ డీ ఛానెల్స్ లో లైవ్ లో చూడొచ్చు. జీ సినిమాలు యూట్యూబ్, వెబ్ సైట్ లో కూడా లైవ్ ఉంటుంది

నా పేరు సూర్య తర్వాత సినిమాలకు షార్ట్ గ్యాప్ ఇచ్చిన బన్నీ, ఇప్పటివరకు తన కొత్త సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. అతడి నుంచి మరో సినిమా రావడానికి ఇంకాస్త టైం పడుతుంది. అందుకే బన్నీని చూసేందుకు ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇక టాక్సీవాలా విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ, ప్రియాంక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో SKN నిర్మాతగా పరిచయమౌతున్నాడు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయి. మరీ ముఖ్యంగా గ్రాఫిక్స్ అందర్నీ ఎట్రాక్ట్ చేయబోతున్నాయి.