ఆడియన్స్ రెడీ ... నిర్మాతలు రెడీనా ?

Sunday,August 08,2021 - 06:49 by Z_CLU

కరోన ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ తర్వాత ఇకపై రెండేళ్ళ వరకూ ప్రేక్షకులు థియేటర్స్ కి రారని ఇక అందరికీ OTT నే ప్రత్యామ్నాయం అంటూ ఇండస్ట్రీ లో మాటలు వినిపించాయి. కానీ ఆ తర్వాత రిలీజైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ కి ప్రేక్షకుల బాగానే వచ్చారు. ఇక ‘క్రాక్’, ‘ఉప్పెన’ లాంటి సినిమాలకు ఫ్యామిలీస్ కూడా కదిలారు. దీంతో ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు రాబట్టాయి.

ఇక సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో ఈసారి కూడా మళ్ళీ అదే మాటలు వినిపించాయి. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ కి మరణాల సంఖ్య అధికంగా ఉండటంతో ఇప్పుడప్పుడే థియేటర్స్ కి జనాలు రారని బడా సినిమాలు సైతం OTT బాట పట్టాయి. కానీ ప్రస్తుతం విడుదలైన చిన్న సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసి మళ్ళీ థియేటర్స్ కి రప్పిస్తున్నాయి. అవును సత్య దేవ్ నటించిన ‘తిమ్మరుసు’ మొదటి రోజు ప్రేక్షకులను రాబట్టలేకపోయినా మెల్ల మెల్లగా ఆడియన్స్ సంఖ్య పెంచుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా పరవాలేదనిపించాయి.

sr kalyanamandapam

తాజాగా విడుదలైన ‘SR కళ్యాణ మండపం’ మాత్రం మొదటి రోజే మంచి వసూళ్ళు అందుకొని మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. నిన్న చాలా ఏరియాల్లో హౌజ్ ఫుల్ బోర్డులు కనిపించాయి. అంటే ఆడియన్స్ థియేటర్స్ లో సినిమా చూసేందుకు రెడీగానే ఉన్నారని మరోసారి ఈ సినిమా రుజువు చేసింది. సో ప్రేక్షకులు రెడీనే కానీ నిర్మాతలే వెనకడుగు వేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త హీరో అయినా.. యావరేజ్ టాక్ వచ్చినా జనాలు థియేటర్స్ లో అడుగుపెట్టి సినిమాలు చూస్తున్నారు. అలాంటిది కాస్త క్రేజ్ ఉన్న స్టార్ సినిమాలు థియేటర్స్ లో దింపితే కచ్చితంగా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి తిమ్మరుసు , SR కళ్యాణ మండపం నిర్మాతల మాదిరిగా మిగతా నిర్మాతలు కూడా ముందుకు వస్తే మళ్ళీ థియేటర్స్ కళకలాడటం ఖాయం.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics