క్రిస్ప్ రన్ టైమ్ తో వస్తున్న అశ్వథ్థామ

Wednesday,January 29,2020 - 12:30 by Z_CLU

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా వస్తున్న అశ్వథ్థామ మూవీ మోస్ట్ ఎమోషనల్ గా ఉండబోతోందనే విషయంపై హీరో నాగశౌర్య ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ఎలాంటి కామెడీ ఎలిమెంట్స్ ఉండవని, కథను నమ్మి నిజాయితీగా తీశామని చెప్పుకొచ్చారు.

ఎలాంటి డీవియేషన్స్ కు పోకుండా, పక్కా స్క్రీన్ ప్లేతో ఈ సినిమా వస్తోందనే విషయం రన్ టైమ్ చూస్తే అర్థమౌతుంది. అవును.. అశ్వథ్థామ సినిమా నిడివి కేవలం 2 గంటల 13 నిమిషాలు మాత్రమే. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి.

ఈ శుక్రవారం (31న) వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది అశ్వథ్థామ. ఈ సినిమాలో నటించడంతో పాటు కథ అందించాడు శౌర్య. మూవీని నిర్మించింది కూడా శౌర్య అమ్మానాన్నలే. సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై తెరకెక్కిన ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఈ హీరో. ఆల్ ది బెస్ట్ శౌర్య.