పదేళ్లు పూర్తిచేసుకున్న అష్టాచమ్మా

Wednesday,September 05,2018 - 12:01 by Z_CLU

కొన్ని సినిమాలు సంచలనం సృష్టించాయనే విషయం రిలీజైన మొదటి వారం అర్థంకాదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత దాని మేజిక్ అర్థమౌతుంది. అర్జున్ రెడ్డి ఎంత సంచలనం సృష్టించిందో అందరం చూశాం. పదేళ్ల కిందట దాదాపు ఇలాంటి సంచలనమే ఒకటి నమోదైంది. దీనిపేరు అష్టాచమ్మ.

స్టార్ ఎట్రాక్షన్ తో సంబంధం లేకుండా కంటెంట్ బాగుండే ఆడే రోజులివి. కానీ కేవలం స్టార్ట్ ఎట్రాక్షన్ ఉంటేనే సినిమా ఆడే ఆ రోజుల్లో కొత్త నటీనటులతో వచ్చి సూపర్ హిట్ అనిపించుకుంది అష్టాచమ్మా. ప్రస్తుతం నేచురల్ స్టార్ అనిపించుకుంటున్న నానికి ఇదే మొదటి సినిమా. ఇక దర్శకుడిగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ కు కూడా ఇదే తొలి చిత్రం.

ఈ సినిమాతో ఇంద్రగంటి మోహనకృష్ణ సత్తా ఏంటో ఇండస్ట్రీకి మరోసారి తెలిసిందే. తొలి చిత్రంతోనే జాతీయస్థాయి అవార్డులు అందుకున్న ఇంద్రగంటికి కమర్షియల్ సినిమా కూడా తీయడం వచ్చని చాటిచెప్పింది ఈ సినిమా.