Ashoka Vanamlo Arjuna Kalyanam ట్రైలర్ రివ్యూ

Wednesday,April 20,2022 - 05:17 by Z_CLU

Ashoka Vanamlo Arjuna Kalyanam Trailer Review

విశ్వక్ సేన్ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా ట్రైలర్ రిలీజైంది. మే 6 న రిలీజవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ తో ఎట్రాక్ట్ చేసిన మేకర్స్ తాజాగా ట్రైలర్ తో సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశారు.

తెలంగాణాలో సూర్యాపేట్ కి చెందిన  ముప్పై ఏళ్లకు పై బడిన పెళ్లి కాని కుర్రాడు అర్జున్ కుమార్ అల్లంకి అంధ్రాలో కోనసీమకి చెందిన అమ్మాయితో పెళ్లి అనే స్టోరీ లైన్ తో తెరకెక్కిన సినిమా అని ట్రైలర్ తో క్లియర్ కట్ చెప్పేశారు. అలాగే ఈ రెండు ప్రాంతాల మధ్య ఉండే వ్యత్యాసంతో దర్శకుడు రవికిరణ్ సినిమాలో మంచి ఫన్ క్రియేట్ చేసినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

“రాసేసి ఉంటది మొత్తం రాసేసి ఉంటది స్క్రిప్ట్” అంటూ ఓ వాయిస్ ఓవర్ తో స్టార్టయిన ట్రైలర్ లో ఎట్టకేలకు ముప్పై ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోబోతున్న అర్జున్ కుమార్ హ్యపినెస్ తో వచ్చే విజువల్స్ ఎట్రాక్ట్ చేశాయి. పెళ్ళికి ముందు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మధ్య ఉండే లవ్ ట్రాక్ తో వాటి నుండి వచ్చే రొమాంటిక్ సీన్స్ తో ట్రైలర్ లో కాస్త రొమాంటిక్ ఎలిమెంట్ కూడా యాడ్ చేశారు.

ఇక పెళ్ళికూతురు అర్జున్ కుమార్ తో పెళ్లి ఇష్టం లేదని చెప్పడం, దాని తర్వాత వచ్చే ఎమోషనల్ సెన్స్ తో  ట్రైలర్ ని కొంచెం ఎమోషనల్ గా ఎండ్ చేసి పెళ్ళికి రెడీ అయిన అమ్మాయి సడెన్ గా ఎందుకు ఇలా చెప్పిందనే క్యూరియాసిటీ రైజ్ చేసి సినిమా త్వరగా చూడాలని ప్రేక్షకుడు అనుకునేలా ఎండ్ చేశారు.

ట్రైలర్ లో విశ్వక్ సేన్ డైలాగ్స్ , కామెడీ  , రొమాంటిక్ సీన్స్ , బ్యూటిఫుల్ విజువల్స్ , ప్లీసెంట్ మ్యూజిక్ ఎట్రాక్ట్ చేసి హైలైట్ గా నిలిచాయి. విశ్వక్ సేన్ -రవి కిరణ్ కోల కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా థియేటర్స్ కి రప్పించే కంటెంట్ తో వస్తుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

 SVCC డిజిటల్ బేనర్ పై  BVSN ప్రసాద్ సమర్పణలో బాపినీడు , సుదీర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా మే 6 న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది.

Ashoka Vanamlo Arjuna Kalyanam ట్రైలర్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

* Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics