య‌దార్థ ఘ‌ట‌న‌ ఆధారంగా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్

Wednesday,July 15,2020 - 12:07 by Z_CLU

తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌ల ఆధారంగా రూపొందించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ “అస‌లేం జరిగింది”. ఈ సినిమా పాట‌ల‌కు ఆడియ‌న్స్ నుంచి చ‌క్క‌టి స్పంద‌న వ‌స్తుంద‌ని చిత్ర నిర్మాత కింగ్ జాన్స‌న్ తెలిపారు. విజ‌య్ ఏసుదాస్‌, విజ‌య్ ప్ర‌కాష్‌, యాజిన్ నిజార్‌, మాళ‌విక‌, రాంకీ, భార్గ‌వి పిళ్లై వంటి ప్ర‌ముఖ సింగ‌ర్లు ఈ పాటలు పాడారు.

ఇప్ప‌టికే ఈ సినిమాకు సెన్సార్ క్లియ‌రెన్స్ వ‌చ్చింది. థియేట‌ర్లు తెరుచుకునేంత‌వ‌ర‌కూ వేచి చూడాలా? లేక ఓటీటీ ప్లాట్‌ఫార‌మ్స్‌లో రిలీజ్ చేయాలా అనే విష‌యంపై ఆలోచిస్తున్నారు.

శ్రీరాం, సంచితా ప‌డుకుణే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు యేలేంద్ర మ‌హావీర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. ఎక్సోడ‌స్ మీడియా బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు నీలిమా చౌదరి నిర్మాత.