రామ్ చరణ్ సినిమాతో రీ ఎంట్రీ ....

Saturday,August 04,2018 - 12:40 by Z_CLU

ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బోయపాటి స్టైల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది. ఈ సినిమాలో హీరో ఆర్యన్ రాజేష్ ఒక రోల్ చేస్తున్నాడన్నది ఆ న్యూస్.

లేటెస్ట్ గా ఆర్యన్ రాజేష్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడని, ఇందులో ఓ నెగిటీవ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ మెయిన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

 మరి ప్రతీ సినిమాలో విలన్ క్యారెక్టర్ ను బాగా ఎస్టాబిలిష్ చేసే బోయపాటి ఆర్యన్ రాజేష్ ను నెగిటీవ్ క్యారెక్టర్ లో ఎలా ప్రెజెంట్ చేస్తాడో..ఈ సినిమాతో రాజేష్ కి ఎలాంటి వెల్కం బ్యాక్ లభిస్తుందో..చూడాలి.