ఒక్కటి కాబోతున్న మరో స్టార్ జంట

Thursday,February 14,2019 - 01:48 by Z_CLU

హీరో ఆర్య, సాయేషా సెహగల్ పెళ్ళి చేసుకోబోతున్నారా..? ఇది నిన్నటి వరకు జస్ట్ రూమరే. కానీ ఈ రోజు వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వీరి పెళ్ళి మార్చి నెలలో హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది.

‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ అయిన సాయేషా కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో బిజీగా ఉంది. ఇక అల్లు అర్జున్ ‘వరుడు’ సినిమాలో నెగెటివ్ రోల్ తో ఇంట్రడ్యూస్ అయిన ఆర్య కి టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా ‘సైజ్ జీరో’ సినిమాలో కూడా హీరోగా నటించాడు ఆర్య.

గతంలో ‘గజినీకాంత్’ సినిమాలో కలిసి నటించిన ఈ జంట, ఈ సినిమా టైమ్ లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ పెళ్ళికి సంబంధించిన మరిన్ని డీటేల్స్ త్వరలో రివీల్ చేస్తారు.