#Rapo19 - రామ్ కి విలన్ అతడేనా?

Wednesday,July 14,2021 - 11:01 by Z_CLU

లింగుస్వామి డైరెక్షన్ లో తెలుగు , తమిళ్ బైలింగ్వెల్ సినిమా చేస్తున్నాడు రామ్. #Rapo19 గా తెరకెక్కుతున్న ఈ సినిమా నిన్నటి నుండి రెగ్యులర్ షూట్ మొదలైంది. ప్రస్తుతం రామ్ పై గండిపేట్ లో ఓ హౌజ్ లో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు విలన్ గా కోలీవుడ్ హీరో ఆర్య ని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. అవును సినిమాలో పవర్ ఫుల్ గా ఉండే స్టైలిష్ విలన్ రోల్ కోసం ఆర్యని తీసుకోనున్నాడట లింగుస్వామి.

Aishwaryabhimasthu _Audio_Launch_Stills_Zeecinemalu

తాజాగా ఆర్య ని కలిసి స్క్రిప్ట్ నరేషన్ కూడా ఐచ్చాదని సమాచారం. ఆర్య గతంలో ‘వరుడు’ సినిమాలో విలన్ గా కనిపించిన సంగతి తెలిసిందే. మళ్ళీ తెలుగులో విలన్ గా నటించలేదు. మళ్ళీ ఇప్పుడు రామ్ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. సినిమాలో రామ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తుంది. అందులో ఒకటి డాక్టర్ రోల్ అయితే మరొకటి పోలీస్ అట. ఈ విషయంపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బేనర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. మరి రామ్ డ్యుయల్ రోల్ అయితే మరో హీరోయిన్ కి కూడా స్కోప్ ఉంటుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics