అర్జున్ సురవరం 2 వారాల వసూళ్లు

Saturday,December 14,2019 - 01:17 by Z_CLU

యువ కథానాయకుడు నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా టి.సంతోష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున్ సురవరం’. బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ (ఎల్ఎల్‌పి) బ్యానర్ పై రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మించారు. నవంబర్ 29న విడుదలైన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా మూడో వారంలోకి ఎంటరైంది.

14 రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ.21.6 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ విషయాన్ని యూనిట్ అఫీషియల్ గా డిక్లేర్ చేసింది. ఈ సందర్భంగా చిరంజీవికి యూనిట్ థ్యాంక్స్ చెప్పింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకి ప్రచారం చేశారు. తొలి ఆడియన్, రివ్యూవర్, ప్రమోటర్ చిరంజీవి గారే.

ఈ సందర్భంగా యూనిట్ అంతా కలిసి మరోసారి సక్సెస్ సంబరాలు చేసుకుంది. ఈసారి సక్సెస్ మీట్ కు రాజ్ తరుణ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా పాల్గొంది.