ఫ్యాన్సీ రేట్ కి ‘అర్జున్ రెడ్డి’ సినిమా హక్కులు

Wednesday,July 26,2017 - 03:10 by Z_CLU

విజయ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ కాని ఈ సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. యూత్ లో భారీ డిమాండ్ ని క్రియేట్ చేసుకున్న ‘అర్జున్ రెడ్డి’ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుంది.

రీసెంట్ గా బాహుబలి 2 సినిమాని రిలీజ్ చేసిన ఏషియన్ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమా హక్కులని ఫ్యాన్సీ రేటుకి దక్కించుకుంది. రధన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ  సినిమాలో విజయ్ దేవరకొండ ఆరోగెంట్ డాక్టర్ లా  నటిస్తున్నాడు. షాలిని హీరోయిన్ గా నటించింది.