అర్జున్ రెడ్డి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది

Saturday,July 29,2017 - 11:23 by Z_CLU

విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి రిలీజ్ డేట్ ఫిక్సయింది. గతంలో ఫిబ్రవరి 13 న టీజర్ తో సినిమా లవర్స్ లో హాయ్ ఎండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి, ఆ తరవాత రిలీజైన సింగిల్స్ తో సినిమా సక్సెస్ కి కావాల్సినంత డిమాండ్ ని క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడీ సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. ఆగష్టు 25 గా రిలీజవుతుంది అర్జున్ రెడ్డి.

 

పెళ్లి చూపులు సినిమాతో అటు యూత్, మాస్ ఆడియెన్స్ కి దగ్గరైన విజయ్ దేవరకొండ, ఈ సినిమా సక్సెస్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమాకి రథన్ మ్యూజిక్ కంపోజర్. సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకి డైరెక్టర్.