మరి కొన్ని గంటల్లో 'అర్జున్ రెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్

Monday,August 21,2017 - 12:48 by Z_CLU

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ కి రెడీ అయింది. ఫిబ్రవరి 13న టీజర్ తో మూవీ లవర్స్ లో హై ఎండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి ఆ తరవాత రిలీజైన సింగిల్స్ తో మ్యూజిక్ లవర్స్ ను సైతం ఎట్రాక్ట్ చేసి సినిమా పై అంచనాలు పెంచాడు. ఆగస్టు 25న వినాయకచవితి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి ఈరోజు సాయంత్రం గ్రాండ్ గా  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ లో కొంత మంది యంగ్ హీరోలతో పాటు   సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నారని సమాచారం.


పెళ్లి చూపులు సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవర కొండ ఈ సినిమాతో డిఫరెంట్ ఆటిట్యూడ్ గల కుర్రాడిగా ఎంటర్టైన్ చేయబోతున్నాడు. విజయ్ సరసన షాలిని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రథన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాడు.