అర్జున్ రెడ్డి హిందీ టైటిల్ ఫిక్సయింది

Friday,October 26,2018 - 12:54 by Z_CLU

రీసెంట్ గా సెట్స్ పైకి వచ్చింది అర్జున్ రెడ్డి హిందీ రీమేక్. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ ఫిక్సయ్యారు ఫిల్మ్ మేకర్స్. దీంతో జస్ట్ బాలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లోను ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది.

అర్జున్ రెడ్డి సినిమాతో కంపేర్ చేస్తే బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టు స్క్రిప్ట్ లో చిన్న చిన్న చేంజెస్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, సినిమాని ముంబై, ఢిల్లీ, ముస్సోరీ లాంటి లొకేషన్ లలో తెరకెక్కించనున్నాడు. ఫస్ట్ సినిమాతోనే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి, కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో తన రేంజ్ మార్క్ క్రియేట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు.

షాహిద్ కపూర్ ఈ సినిమాలో 4 డిఫెరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. T-సిరీస్, సినీ 1 స్టూడియోస్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా జూన్ 21, 2019 న రిలీజ్ అవుతుంది.