U.S. లో మిలియన్ మార్క్ రీచ్ అయిన అర్జున్ రెడ్డి

Tuesday,August 29,2017 - 05:03 by Z_CLU

విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి రిలీజైన ప్రతి సెంటర్ లోను సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. బోల్డ్ యూత్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ఈ సినిమా, తెలుగు స్టేట్స్ లోనే కాదు, ఓవర్ సీస్ లోను అంతే క్రేజ్ క్రియేట్ చేసుకుంది. సినిమా మేకింగ్ ప్రాసెస్ లో ఉండగానే టీజర్ తో మ్యాగ్జిమం అటెన్షన్ గ్రాబ్ చేసిన సినిమా యూనిట్, ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. సినిమా రిలీజైన 4 రోజుల్లోనే U.S. లో మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది.

U.S. లో రోజురోజుకి ఈ సినిమా పట్ల పెరుగుతున్న క్రేజ్ చూస్తుంటే, అర్జున్ రెడ్డి త్వరలో 2 మిలియన్ మార్క్ ని క్రాస్ చేయడం గ్యారంటీ అనిపిస్తుంది. ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్. షాలిని ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.