బన్నీ సినిమాలో ఆ హీరో కీలక పాత్ర

Saturday,April 01,2017 - 03:00 by Z_CLU

పెజెంట్ ‘డి.జె’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే వక్కంతం వంశీ దర్శకత్వం లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్ తో దేశభక్తి కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో అర్జున్ ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది..


ఇప్పటికే ఎన్నో దేశభక్తి సినిమాల్లో పవర్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసిన అర్జున్ ఈ సినిమాలో ఓ పవర్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని అనుకున్న వక్కంతం ఇటీవలే అర్జున్ ను కలిసి ఈ సినిమా స్టోరీ చెప్పాడని టాక్. కథతో పాటు క్యారెక్టర్ కూడా బాగా నచ్చడంతో అర్జున్ ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచేసినట్లు సమాచారం. మరి గతంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘సన్ ఆఫ్ సత్య మూర్తి’ సినిమాలో ఓ కీలక మైన క్యారెక్టర్ ను కొన్ని కారణాల వల్ల వదులుకున్న అర్జున్ ఈ సినిమాలో అయినా బన్నీ తో కలిసి ఎంటర్టైన్ చేస్తాడేమో చూడాలి..