అర్జున్ క్యారెక్టర్ రివీల్ చేస్తున్న ‘కురుక్షేత్రం’ ట్రైలర్

Wednesday,June 27,2018 - 06:15 by Z_CLU

యాక్షన్ కింగ్ అర్జున్ ‘కురుక్షేత్రం’ ట్రైలర్ రిలీజయింది. అర్జున్ కరియర్ లో ఇది 150 వ సినిమా కావడంతో ఈ సినిమా చుట్టూ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. దానికి తోడు ఈ రోజు రిలీజైన ఈ ట్రైలర్ ని న్యాచురల్ స్టార్ నాని సోషల్ మీడియాలో లాంచ్ చేయడంతో ఇంట్రెస్టింగ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది ఈ ట్రైలర్.

రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ ‘కురుక్షేత్రం’ థీమ్ ని ఎలివేట్ చేస్తే, ఈ ట్రైలర్ లో అర్జున్ క్యారెక్టరైజేషన్ ని మరింత రివీల్ చేశారు ఫిల్మ్ మేకర్స్. 1:37 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్, సెలెబ్రిటీస్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ అతి కిరాతకంగా చంపుతున్న ఒక సైకిక్ కిల్లర్ ఎవరా అనే క్యూరియాసిటీని రేజ్ చేస్తుంది. దానితో పాటు ఈ సినిమాలో అర్జున్, ఒక రేర్ డిసీజ్ తో ఇబ్బందిపడే పోలీసాఫీసర్ లా కనిపించనున్నాడు.

నవీన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాను ఉమేష్, సుధన్ సుందరం, జయరామ్ సంయుక్తంగా ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అరుణ్ వైద్యనాథన్ ఈ సినిమాకి డైరెక్టర్.