ఎట్రాక్ట్ చేస్తున్న అర్జున్ కురుక్షేత్రం

Tuesday,May 30,2017 - 01:28 by Z_CLU

టాలీవుడ్ లో అప్పుడే కురుక్షేత్రం బిగిన్ అయిపోయిందా అనిపిస్తుంది. యాక్షన్ స్టార్ అర్జున్ 150 వ సినిమా ఫస్ట్ లుక్ నిన్న రిలీజయింది. అర్జున్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్  ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు తో పాటు తమిళ, కన్నడ భాషల్లోను ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్.

ప్రస్తుతం తెలుగులో ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ‘కురుక్షేత్రం’ టీజర్ ని రైట్ టైమ్ చూసుకుని రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. ఇప్పటికే తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, తెలుగులోనూ ఎట్రాక్ట్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.

 

సుమన్, సుహాసినీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా అరుణ్ వైద్యనాథన్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.  S. నవీన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న సినిమా యూనిట్, జూలైలో సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.