అర్జున్ ఇంటర్వ్యూ

Wednesday,May 30,2018 - 10:03 by Z_CLU

జూన్ 1 న గ్రాండ్ గా రిలీజవుతుంది విశాల్ అభిమన్యుడు. ఇప్పటికే తమిళంలో సూపర్ హిట్టయిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో విలన్ రోల్ ప్లే చేసిన యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో తన రోల్ గురించి మీడియాతో మాట్లాడాడు. ఆ విషయాలు మీ కోసం…

అదే నా క్యారెక్టర్…

‘అభిమన్యుడు’ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ చాలా రేర్ గా ఉంటుంది, గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్. చాలా స్టైలిష్ గా ఉంటుంది.

విలన్ గా చేయడమంటే…

ఇన్ని సినిమాలు చేశాక ఎవరైనా వచ్చి విలన్ రోల్ ఉంది చేయమంటే, ఫస్ట్ నా మైండ్ లో తిరిగేది ఎందుకు నెగెటివిటీ ఉన్న రోల్ చేయాలి..? కానీ ఎప్పుడైతే ఈ సినిమాలో నా రోల్ విన్నానో ఇంప్రెస్ అయిపోయాను… సినిమాలో చాలా మంచి విషయాలపై డిస్కర్షన్ జరిగింది.

 

చాలెంజ్ చేస్తున్నా…

ఈ సినిమాలో నేను ప్లే చేసిన క్యారెక్టర్ లాంటిది ఇప్పటి వరకు మీరెప్పుడూ చూసి ఉండరు. చాలెంజ్ చేసి చెప్తున్నా… ఈ సినిమాకి నేను నో చెపి ఉంటే.. చాలా పెద్ద తప్పు చేసిన వాడినయ్యేవాడిని… ఒకే ఒక్కడు, జై హింద్, జెంటిల్ మెన్ సినిమాలకు నాకెంత పేరు వచ్చిందో ఈ సినిమాకు నాకు అంతే పేరు వస్తుంది.

ప్రతీది పర్ఫెక్ట్ గా…

ఈ సినిమాలో ఏది కూడా కావాలని ఆడ్ చేసింది ఉండదు. మన రెగ్యులర్ లైఫ్ లో ఫోన్స్ కి ఎంత అడిక్ట్ అవుతున్నాం… ఒకసారిగా పెరిగిపోయిన టెక్నాలజీ, దానివల్ల ఏం జరుగుతుంది అనేది సినిమాలో ఉంటుంది…

అలాంటి ప్రాబ్లమ్ లేదు…

దర్శకుడు మిత్రన్ కి ఇది ఫస్ట్ మూవీ… కానీ సినిమా చాలా బాగా తీశాడు. ఒక్కోసారి కథ చాలా బాగా ఉంటుంది స్కీన్ పై చూసేసరికి ఎగ్జిక్యూషన్ కుదరదు. మిత్రన్ అలాంటి మిస్టేక్స్ చేయలేదు. తమిళనాడులో సినిమా బ్లాక్ బస్టర్ అయింది.

 

చాలా మందికి చేశాను…

నేను శంకర్ ఫస్ట్ సినిమాలో చేశాను.. అలాగే చాలా మంది డైరెక్టర్స్ ఫస్ట్ సినిమాలో చేశాను.. మిత్రన్ కి కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంది…

నా పేరు సూర్య సినిమా కూడా అంతే…

రీసెంట్ గా అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ లో ఫాదర్ రోల్ చేయమని అడిగినప్పుడు కూడా ఆలోచించా.. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తున్నా.. ఫాదర్ గా చేయడం అవసరమా అనిపించింది. కానీ క్యారెక్టర్ విని నచ్చి చేశాను…

సెంటిమెంట్ సినిమాలు…

రీసెంట్ గా కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ ‘రాణి రాణెమ్మ’ బిగిన్ చేశాము. కానీ ఆయన హెల్త్ పాడవ్వడంతో దానికి బ్రేక్ పడింది. త్వరలో మళ్ళీ ఆ సినిమా స్టార్ట్ అవుతుంది.

 

విశాల్ నా శిష్యుడు…

విశాల్ గతంలో నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు, ఇప్పుడు కూడా ఈ క్యారెక్టర్ చెప్పడం కోసం తను రాకుండా డైరెక్టర్ ని పంపించాడు. ఒకవేళ క్యారెక్టర్ నచ్చకపోతే తిట్టేస్తానేమోనని…

డైరెక్టర్ గా…

రీసెంట్ గా కన్నడలో ఒక సినిమా డైరెక్ట్ చేశాను. మా అమ్మాయి హీరోయిన్ గా చేసింది. 75 రోజులు ఆడింది ఆ సినిమా.  ఆ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాను…

అందుకే గ్యాప్…

సినిమా విషయంలో చాలా చూజీగా ఉంటాను. దానికి తోడు డిఫెరెంట్ డిఫెరెంట్ లాంగ్వేజెస్ లో చేస్తున్నాను కాబట్టి గ్యాప్ వస్తుంది.