అరవింద సమేత.. నైజాంలో రికార్డు రిలీజ్

Tuesday,October 09,2018 - 02:31 by Z_CLU

రికార్డులు సృష్టించాలన్నా, కలెక్షన్లు కొల్లగొట్టాలన్నా ఏ సినిమాకైనా నైజాం చాలా కీలకం. భారీ మార్కెట్ ఉన్ననైజాంలో ఎక్కువ థియేటర్లు దొరికితే ఓపెనింగ్స్ అదిరిపోయినట్టే. ఈ విషయం అరవింద సమేత పక్కా స్కెచ్తో ముందుకెళ్తోంది. నైజాంలో ఈ సినిమాకు అత్యథిక సంఖ్యలో థియేటర్లు దొరికాయి.

అవును.. నైజాంలో 3 వందలకు పైగా థియేటర్లలో అరవింద సమేత రిలీజ్ కాబోతోంది. వీటిలో  ఒక్క హైదరాబాద్ లోనే 100 స్క్రీన్లున్నాయి. సినిమా రిలీజ్ కు ఇంకా 2 రోజులు టైం ఉంది. సో.. ఈ 48 గంటల్లో అరవిందసమేతకు నైజాం రూరల్ లో మరిన్ని థియేటర్లు దక్కే ఛాన్స్ ఉంది.

అటు ఓవర్సీస్ లో కూడా అరవింద సమేత భారీ ఎత్తున విడుదలకానుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్స్ తో పాటు, మొదటి 3 రోజులకు సంబంధించి టిక్కెట్లన్నీ ఎప్పుడో అమ్ముడుపోయాయి.ఏపీ,నైజాంలో కూడా ఆల్ మోస్ట్ అన్ని షోలు ఫుల్ అయిపోయాయి. ట్రెండ్ చూస్తుంటే.. ఫస్ట్ డే వసూళ్లలోఅరవింద సమేత ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసేలా ఉంది.