అందమైన 'అరవింద సమేత'

Wednesday,October 10,2018 - 10:02 by Z_CLU

రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమా అంటే… కేవలం హింసను చూపించడమే జరిగింది.. అరవింద సమేతలో  ఆ ప్రాంతాన్ని ఎలా చూపించాలనుకున్నారు ..అనే ప్రశ్న కి తన మనసులోని మాటలతో జవాబిచ్చాడు త్రివిక్రమ్… “నిజమే రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమలొచ్చాయి.. కానీ ఈసారి హింసతో పాటు ఆ ప్రాంతం తాలూకు అందం కూడా చూపించాలనుకున్నాను.. ఆ మధ్య కొంత మంది రచయితలను కూడా కలిసి మాట్లాడటం జరిగింది. కొన్ని పుస్తకాలను చదివాను.

సీమ గురించి మొత్తం తెలుసుకోవడానికి తిరుమల రామచంద్ర  గారు రచించిన ‘హంపీ నుంచి హరప్పా’ దాక అనే  పుస్తకం బాగా ఉపయోగపడింది. ఆ పుస్తకాన్ని తనికెళ్ళ భరణి గారు నాకిచ్చారు. అలా రాయలసీమ గురించి అక్కడ యాస గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి రీసెర్చ్ చేసి మరీ డైలాగ్స్ రాసుకున్నా. ఇప్పటి వరకూ ఎవరూ వాడని సీమ పదాలు ఈ సినిమాలో వినబడతాయి.

నిజానికి  ఆ యాస తాలూకు సొగసును పట్టుకోవడం జరిగింది. అక్కడ ఉండే హింస మాత్రమే కాకుండా అక్కడి అందాన్ని కూడా చూపించి ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి కలిగించాలనుకున్నాను. అందుకే పెంచల్ దాస్ గారి సపోర్ట్ అందుకున్నా.  సీమ నుండి వచ్చిన వ్యక్తి కావడంతో సినిమాకు చాలా హెల్ప్ అయింది. ఇవన్నీ కలగలిపి  గతంలో వచ్చిన రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలకు ‘అరవింద సమేత’ కాస్త భిన్నంగా అనిపిస్తుంది…” అంటూ చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్