మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి అరవింద సమేత

Wednesday,October 10,2018 - 11:06 by Z_CLU

ఎన్టీఆర్-త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అరవింద సమేత విడుదలకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి అడుగుపెట్టబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్నో అంచనాలు, మరెన్నో బాక్సాఫీస్ లెక్కల మధ్య అరవింద సమేతంగా వీరరాఘవుడు థియేటర్లలో మెరుపులు మెరిపించబోతున్నాడు.

అంచనాలకు తగ్గట్టే అరవింద సమేత ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయం. ఎందుకంటే, ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. కేవలం మొదటి రోజు మాత్రమే కాదు. వీకెండ్ మొత్తం, అంటే దాదాపు 4 రోజులకు గాను 80శాతం బుకింగ్స్ పూర్తయ్యాయి. అటు ఓవర్సీస్ లో అయితే వచ్చే సోమవారం మాత్రమే టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణలో రికార్డు థియేటర్లలో విడుదలకానుంది అరవింద సమేత. ప్రస్తుతం అందిన లెక్కల ప్రకారం హైదరాబాద్ లో 110 స్క్రీన్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అటు జిల్లాల్లో కూడా కౌంట్ మరో 40 వరకు పెరిగే ఛాన్స్ ఉంది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో అరవిందకు ఎదురులేదు. రోజుకు 6 షోలు చొప్పున వేసుకునేందుకు ప్రభుత్వం నుంచి స్పెషల్ పర్మిషన్ వచ్చింది. దీనికి తోడు మెయిన్ సెంటర్లలో 80శాతం థియేటర్లు అరవిందకే దక్కాయి.

ఈ మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ పై కన్నేశాడు యంగ్ టైగర్. తమన్ అందించిన సంగీతం ఇప్పటికే పెద్ద హిట్ అవ్వడం, ట్రయిలర్ కు ఇప్పటికీ లక్షల్లో వ్యూస్ రావడం ఈ సినిమాపై యూనిట్ లో నమ్మకాన్ని పెంచింది.

మరికొన్ని గంటల్లో ఓవర్సీస్ ప్రీమియర్స్ స్టార్ట్ అవుతాయి. ఇక ఏపీలో మొట్టమొదటి షో ఉదయం 5 గంటలకే పడబోతోంది. సో.. ఈరోజు అర్థరాత్రికే అరవింద సమేత ఫస్ట్ టాక్ వచ్చేస్తుంది.