మరో 2 రోజుల్లో అరవింద సమేత రిలీజ్

Tuesday,October 09,2018 - 01:29 by Z_CLU

అరవింద సమేతకు అన్నీ క్లియర్ అయ్యాయి. నిన్ననే ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. సినిమా డ్యూరేషన్ అటుఇటుగా 162 నిమిషాలు ఉన్నట్టు టాక్ బయటకు వచ్చింది. మరో 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది అరవింద సమేత

సెన్సార్ పూర్తవ్వడంతో, అరవింద సమేత టాక్ లైట్ గా బయటకొచ్చింది. యంగ్ టైగర్ నుంచి మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటోంది సోషల్ మీడియా. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ ఔట్ స్టాండింగ్ గా ఉందంటూ  పోస్టులు పడుతున్నాయి.

మరోవైపు యూనిట్ ప్రచారాన్ని భారీస్థాయిలో చేస్తోంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ అన్నీ తానై ఈ సినిమా ప్రమోషన్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. మరికొన్ని గంటల్లో ఓవర్సీస్ లో అరవింద సమేత ప్రీమియర్స్ స్టార్ట్ కాబోతున్నాయి.

హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లు.