అరవింద సమేత – రెడ్డమ్మ తల్లి ప్రోమో సాంగ్

Wednesday,October 24,2018 - 04:43 by Z_CLU

అరవింద సమేత నుండి ‘రెడ్డమ్మ తల్లి’ ప్రోమో సాంగ్ రిలీజయింది. గతంలో పెంచల్ దాస్ వర్షన్ లో ఈ సాంగ్ ని రిలీజ్ చేసిన మేకర్స్, ఈ రోజు సినిమాలో ఉన్న ఫీమేల్ వర్షన్ వీడియోని రిలీజ్ చేశారు.  సినిమా రిలీజై 2 వారాలు కావస్తున్నా, ఇంకా కంటిన్యూ అవుతున్న అరవింద మ్యాజిక్ కి మరింత గ్రేస్ ని ఆడ్ చేస్తుంది ఈ ప్రోమో సాంగ్.

సినిమాలో ఆల్మోస్ట్ క్లైమాక్స్ సిచ్యువేషన్ లో ఉండే ఈ సాంగ్, ప్రతి ఆడియెన్ అదే ఫీల్ తో థియేటర్ నుండి బయటికి వచ్చేంతలా మెస్మరైజ్ చేసింది. బసిరెడ్డి చనిపోయిన తరవాత ‘వీర రాఘవ’ పెద్దా రెడ్డమ్మ దగ్గరికి వెళ్ళే కీలక సందర్భంలో ఉండే ఈ పాట, సినిమాని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది. సినిమాలో ‘పెనివిటి’ సాంగ్ తర్వాత మళ్ళీ అదే రేంజ్ ఫీల్ క్రియేట్ చేసిన సాంగ్ రెడ్డమ్మ తల్లి. ఈ పాటని మోహన భోగరాజు పాడింది.

అరవింద సమేతకి త్రివిక్రమ్ డైరెక్టర్. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కింది.