అరవింద సమేత కొత్త షెడ్యూల్ డీటెయిల్స్

Monday,July 16,2018 - 11:10 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ అరవింద సమేత. మినిమం గ్యాప్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇవాళ్టి నుంచి కొత్త షెడ్యూల్ మొదలైంది. రామోజీ ఫిలింసిటీలో అరవింద్ సమేత ఫ్రెష్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ తో పాటు మరికొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

వచ్చేనెల 3వ తేదీ వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఆ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకొని, యూనిట్ అంతా పొలాచ్చికి వెళ్తుంది. అక్కడ మరో 2 వారాల షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇలా అరవింద సమేత షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేస్తున్నాడు దర్శకుడు త్రివిక్రమ్.

ఈ సినిమా టీజర్ ను ఆగస్ట్ 15న విడుదల చేస్తారనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ డిజైన్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కూడా రిలీజ్ అయితే అరవింద సమేతపై అంచనాలు డబుల్ అవుతాయి.

హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.