అరవిందకు లైన్ క్లియర్.. రెడీ ఫర్ రిలీజ్

Monday,October 08,2018 - 06:29 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ అరవింద సమేతకు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది. సెన్సార్ ఆఫీసర్లు సినిమాకు ఎలాంటి కట్స్ చెప్పలేదు. సెన్సార్ పూర్తవ్వడంతో అరవింద సమేత రిలీజ్ కు అఫీషియల్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టయింది. దసరా కానుకగా గురువారం ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలకానుంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అరవింద సమేత చిత్రానికి స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. 11వ తేదీ నుంచి 18 వరకు రోజుకు 6 షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్య అదనంగా 2 షోలు వేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు ఓవర్సీస్ లో బుధవారం నుంచే ప్రీమియర్స్ షురూ కానున్నాయి.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ ఎక్స్ పెక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కింది అరవింద సమేత. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు.