అరవింద సమేత 11 రోజుల కలెక్షన్

Monday,October 22,2018 - 01:59 by Z_CLU

దసరా కానుకగా విడుదలైన అరవింద సమేత సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కళ్లుచెదిరే వసూళ్లు రాబడుతోంది. నిన్నటితో 11 రోజుల రన్ పూర్తిచేసుకున్న అరవింద సమేత.. లేటెస్ట్ గా 150 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది.

ఇక షేర్స్ పరంగా చూస్తే, వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 90 కోట్ల షేర్ వచ్చినట్టు ట్రేడ్ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ షేర్ 11 రోజులకు 69 కోట్ల రూపాయలుగా ఉంది. అటు ఓవర్సీస్ లో ఈ 11 రోజుల్లో 2.08 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది అరవింద సమేత.

ట్రేడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైజాంలో నిన్నటి వసూళ్లతో కలుపుకొని 20 కోట్ల రూపాయల షేర్ తో, బ్రేక్-ఈవెన్ సాధించింది అరవింద సమేత. నైజాంలో తక్కువ టైమ్ లో 20 కోట్ల షేర్ అందుకున్న ఎన్టీఆర్ సినిమా ఇదే.

అటు సీడెడ్ లో ఈ సినిమాకు నిన్నటి వసూళ్లతో కలుపుకొని 15 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈరోజు లేదా రేపు బ్రేక్-ఈవెన్ లోకి రావొచ్చు.