అరవింద సమేత ట్రైలర్ కి తగ్గని క్రేజ్

Tuesday,October 09,2018 - 07:31 by Z_CLU

మరికొన్ని గంటల్లో థియేటర్స్ లోకి రానుంది అరవింద సమేత. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి గంటలు గడిచే కొద్దీ ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఆ ఇంపాక్ట్ రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ పై కనిపిస్తుంది. రిలీజైన 12 గంటల్లోనే ఏకంగా మిలియన్ వ్యూస్ ని దాటేసిన ఈ ట్రైలర్ ఇప్పటికీ యూ ట్యూబ్ లో 17 ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఈ ట్రైలర్ కోటి 8 లక్షల వ్యూస్ దాటేసింది.

గతంలో రిలీజైన టీజర్ కి కొనసాగింపుగా ఉన్న ఈ ట్రైలర్ లో దాదాపు స్టోరీలైన్ చెప్పేశారు ఫిల్మ్ మేకర్స్. ఇమోషన్ ఎలిమెంట్స్ తో పాటు NTR లోని మోస్ట్ అగ్రెసివ్ యాంగిల్ ని రివీల్ చేస్తున్న ఈ ట్రైలర్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేస్తుంది. అందుకే ఈ ట్రైలర్ కి గంట గంటకి వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి.

జస్ట్ 2 నిమిషాల ట్రైలర్ కే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉందంటే సినిమా రికార్డ్స్ బ్రేక్ చేయడం గ్యారంటీ అని అంచనాలు వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి S. రాధాకృష్ణ ప్రొడ్యూసర్. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.