NBK108 బాలయ్య సినిమాలో అరవింద్ స్వామి ?

Monday,September 05,2022 - 04:25 by Z_CLU

ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయబోతున్నాడు. ఇటివలే ప్రకటించిన ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అక్టోబర్ లేదా నంబర్ నుండి సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడని సమాచారం.

సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం అరవింద్ స్వామి ను తీసుకోనున్నారని తెలుస్తుంది. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘ధృవ’ సినిమాలో అరవింద్ సామి విలన్ గా నటించాడు. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. తాజాగా అనిల్ రావిపూడి అరవింద్ స్వామిను సంప్రదించి స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చాడని టాక్.

కేరెక్టర్ నచ్చడంతో అరవింద్ స్వామి బాలయ్య సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. సినిమాలో బాలయ్య కూతురి పాత్రకు హీరోయిన్ శ్రీలీల ను లాక్ చేశారని టాక్ ఉంది. ఇంకా మేకర్స్ నుండి దీనిపై ప్రకటన రాలేదు. త్వరలోనే కాస్టింగ్ ను ఫైనల్ చేసుకొని ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. షైన్ స్క్రీన్స్ బేనర్ పై సాహు గారపాటి , హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అనిల్ రావిపూడి -తమన్ కాంబో లో వస్తున్న మొదటి సినిమా ఇది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics