చిరంజీవికి అరవింద్ స్వామి డబ్బింగ్

Monday,September 09,2019 - 04:31 by Z_CLU

అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలకు ముస్తాబవుతోంది సైరా సినిమా. తమిళ్ లో కూడా విడుదలకానున్న ఈ సినిమాకు మొన్నటివరకు డబ్బింగ్ సమస్యలు ఉండేవి. చిరంజీవి వెర్షన్ కు తమిళ్ లో ఎవరు డబ్బింగ్ చెబుతారనే సస్పెన్స్ ఉండేది. ఎట్టకేలకు ఈ ఇష్యూ క్లియర్ అయింది. తమిళ సైరాలో మెగాస్టార్ కు అరవింద్ స్వామి డబ్బింగ్ చెబుతున్నాడు.

ధృవ సినిమాతో బాగా క్లోజ్ అయ్యారు అరవింద్ స్వామి, రామ్ చరణ్. పైగా ఆ సినిమాకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి, ఇప్పుడు సైరాకు కూడా డైరక్టర్. సో.. తమిళ వెర్షన్ లో చిరంజీవి వాయిస్ కు అరవింద్ స్వామి అయితే బాగుంటుందని అంతా ఫిక్స్ అయ్యారు. చిరంజీవి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

అంతేకాదు.. ఈ సినిమాలో కమల్ హాసన్ వాయిస్ కూడా వినిపించబోతోంది. సినిమా స్టార్టింగ్ లో కమల్ హాసన్ వాయిస్ వినిపిస్తుంది. తెలుగులో ఈ వాయిస్ ఓవర్ ను పవన్ కల్యాణ్ ఇచ్చిన విషయం తెలిసిందే.