అరణ్య టీజర్ రివ్యూ

Saturday,February 15,2020 - 12:17 by Z_CLU

దాదాపు రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాడు దగ్గుబాటి రానా. అతడు నటించిన అరణ్య సినిమా రిలీజ్ కు రెడీ అయింది. తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే టీజర్ అదిరిపోయింది.

తన ప్రతి సినిమాతో ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయడానికి ప్రయత్నించే రానా, ఈసారి పూర్తిగా కొత్తదనం ట్రై చేశాడు. అడవి నేపథ్యంలో ఏనుగులతో కలిసి అరణ్య సినిమా చేశాడు. ఇదొక డిఫరెంట్ మూవీ అనే విషయం టీజర్ చూస్తేనే అర్థమౌతుంది. అడవిలో ఏనుగుల మధ్య ఉండే అరణ్య అనే వ్యక్తి, ఆ ఏనుగుల కోసం ఏం చేశాడనేది సినిమా స్టోరీ.

టీజర్ లో విజువల్స్ అదిరిపోయాయి. మరీ ముఖ్యంగా థాయ్ లాండ్ లోని దట్టమైన అడవుల్లో 150 రోజుల పాటు షూట్ చేసిన సన్నివేశాల్లో కొన్ని టీజర్ లో చూపించారు. టీజర్ లో సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి.

ఎరోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై 3 భాషల్లో వస్తున్న అరణ్య సినిమాను ప్రభు సాల్మాన్ డైరక్ట్ చేశాడు. విష్ణు విశాల్, జోయా హుస్సేన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 2న థియేటర్లలోకి రానుంది.