మురుగదాస్ ఇంటర్వ్యూ

Tuesday,September 26,2017 - 04:22 by Z_CLU

కంటెంట్ తో మాయ చేసి స్క్రీన్ ప్లే  తో  మేజిక్ చేసే దర్శకుల్లో ఒకడు మురుగదాస్.. తమిళ్ లో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ దూసుకెళ్తున్న ఈ స్టార్ డైరెక్టర్ లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ తో తెలుగు,తమిళ్ భాషలో బై లింగ్వెల్ గా ‘స్పైడర్’ సినిమాను తెరకెక్కించాడు. ఇంటలిజెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా  దసరా కానుకగా రేపే తెలుగు, తమిళ్‌, మలయాళం, అరబిక్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు మురుగదాస్ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…

 

ఇన్నేళ్ళకు మళ్ళీ

ఇప్పటి వరకూ నేను తమిళ్ తో తీసిన సినిమాలన్నీ తెలుగులో డబ్బింగ్ సినిమాలుగా రిలీజ్ అయ్యాయి.. నా సినిమాలు తమిళ్ తో పాటే ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. స్టాలిన్‌ తర్వాత పదేళ్లకు మళ్ళీ నేను తెలుగులో చేస్తున్న స్ట్రయిట్‌ మూవీ. డెఫనెట్‌గా తెలుగు, తమిళ ఆడియెన్స్‌ను అలరిస్తుందని చెప్పగలను. మొదటి సారిగా తెలుగు, తమిళ్ లో బైలింగ్వెల్ గా ఈ సినిమాను రూపొందించాను. ఈ సినిమా కచ్చితంగా తెలుగు , తమిళ్ ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేస్తుందని నమ్ముతున్నా.

 

పదేళ్లు వెయిట్‌ చేసినందుకు హ్యాపీ

విజయవాడలో ‘ఒక్కడు’ సినిమా చూశాను. ఆ సినిమా క్యాజువల్‌గా మహేష్‌ చూపించిన సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌ నాకు బాగా నచ్చింది. తర్వాత స్టాలిన్‌ సినిమా చేస్తున్నప్పుడు పక్కనే పోకిరి సినిమా సాంగ్‌ షూట్‌ జరుగుతోంది. అప్పుడు ఆయనను కలిసి నేను మీతో సినిమా చేయాలనుకుంటున్నానండి..అని అన్నాను. తను కూడా పాజిటివ్‌గానే రియాక్ట్‌ అయ్యారు. అయితే తర్వాత నేను గజినీతో హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. బిజీ అయ్యాను.
ఫైనల్ గా ఇప్పటికి ఈ సినిమా రూపంలో మా కాంబినేషన్ కుదరడం సంతోషంగా ఉంది.

 

ఈరోజుల్లో ఏది దాచలేం.. అదే సినిమా కథ.

ఈ రోజుల్లో ఏ వ్యక్తి ఎలాంటి సీక్రెట్ ను మైంటైన్ చేయలేడు.. ఏదైనా సంఘటన జరిగితే అక్కడే ఉన్న వ్యక్తి కి ఏం సంబంధం లేదని తప్పించుకునే ఛాన్స్ లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంత అలర్ట్ గా ఉందిప్పుడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇన్విజిబుల్ టెర్రరిస్ట్ లాంటి వ్యక్తి ఎలాంటి సమస్యలు సృష్టించాడు. అతన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా పనిచేసే ఓ ఆఫీసర్ ఎలా ఎదురుకున్నాడు.. వారి మధ్య ఎలాంటి సంఘటనలు ఏర్పడ్డాయి. అనేదే సినిమా కథాంశం.

 


రెగ్యులర్ గా ఉండకూడదనే అనుకున్నాం

నిజానికి తెలుగు, తమిళంలో మహేష్ గారితో ఓ సినిమా అనుకోగానే కథలో హీరోయిజం ఉండాలి. ఫ్యామిలీ ఆడియెన్స్‌, ఫ్యాన్స్‌, రెగ్యులర్‌ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటూనే కొత్తగా అనిపించాలనుకున్నాం. మా కాంబినేషన్ లో రెగ్యులర్ సినిమా చేయకూడదని ఫిక్స్ అయ్యాం.. అలాగే తమిళంలో కూడా మహేష్‌ చేస్తున్న స్ట్రయిట్‌ మూవీ కాబట్టి కరెక్ట్‌గా బ్యాలెసింగ్ గా ఉండాలి అనుకున్నాం. కాబట్టి స్క్రిప్ట్‌ మోడ్రన్‌గా ఉండాలని డిసైడ్ అయ్యే ఈ స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేసాం. పదేళ్లు వెయిట్‌ చేసినందుకు తగ్గ సినిమా చేసినట్లు అనిపించింది. డెఫనెట్‌గా తెలుగు, తమిళ ఆడియెన్స్‌ను బాగా అలరిస్తుందని నమ్ముతున్న.

 

మహేష్ క్యారెక్టర్ చాలా స్టైలిష్ గా ఉంటుంది 

ఐబి ఆఫీస్‌లో జూనియర్‌ ఇంటెలిజెంట్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌ లో మహేష్ నటించాడు. క్యారెక్టర్ చాలా స్టైలిష్‌గా వుంటుంది. ఇంటెలిజెన్సీ అనేది ఎలా వుంటుంది అనేది అతని క్యారెక్టర్‌ ద్వారా చూపిస్తున్నా. హీరో, విలన్‌ మధ్య పవర్‌ఫుల్‌ ఎనిమిటీ వుంటుంది. దాన్ని మహేష్‌ చాలా అద్భుతంగా చేశారు.

 

సినిమాలో ఆ ఫ్లేవర్ ఎక్కువ ఉండొచ్చు… రీజన్ అదే !

నేను చెన్నై వాడిని కాబట్టి కచ్చితంగా సినిమాలో తమిళ్ ఫ్లేవర్ ఎక్కువగా కనిపించొచ్చు..కానీ అది సినిమాకు ఏమాత్రం మైనస్ కాదని గట్టిగా నమ్ముతున్నా.. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంటె ఆడియన్స్ మిగతావి పెద్దగా పట్టించుకోరనేది నా ఫీలింగ్. ఉదాహరణకి బాహుబలి, దంగల్ లాంటి సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకొని పెద్ద విజయాలు సాధించాయి.

 

మెసేజ్ కచ్చితంగా ఉంటుంది

రెగ్యులర్ గా నా సినిమాలో ఏదో ఒక మెసేజ్ అందించాలనుకుంటాను. సినిమా అనేది చాలా పవర్ ఫుల్.. ఆ పవర్ తో మనకు అనిపించిన మెసేజ్ ఇవ్వాల్సిందే. ఈ సినిమాలో మెసేజ్ ఉంటుంది. ప్రతీ ఒక్కడు పక్క వ్యక్తి గురించి ఆలోచించాలి..అనేది చెప్పాలనుకున్నా.. ఒకప్పుడు ఉమ్మడిగా కలిసి ఉంటూ మనుషులతో గడిపే వ్యక్తులు ఇప్పుడు ఫోన్, టీవీ, కంప్యూటర్ లాంటి డివైస్ లతో గడిపేస్తున్నారు ఇది ఓ భాగంగా చెప్పే ప్రయత్నం చేసాను. ఇవన్నిటితో పాటు ఇంటెలిజెన్స్ స్క్రీన్ ప్లే పెద్ద స్టార్ తో చెప్పే ప్రయత్నం చేశాను.

 

స్టార్ తోనే మెసేజ్ అందించాలి

నిజానికి స్టార్ హీరోతో ఓ కమర్షియల్ సినిమా చేసి అందులోనే ఆ స్టార్ తోనే ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలి..అప్పుడే అది కొంత వరకూ అయినా కనెక్ట్ అవుతుంది.. ఆడియన్స్ లో ఒక ఆలోచన కలిగించేధీ స్టార్లే.. అందుకే నా సినిమాల్లో స్టార్ హీరోలతో మెసేజ్ ఇస్తుంటాను.

 

హైదరాబాద్ లో జరిగే కథే ‘స్పైడర్’…

ఈ సినిమా కథంతా హైదరాబాద్ లోనే జరుగుతుంది. అందుకే ఎక్కవ శాతం షూటింగ్ ఇక్కడే చేశాం.తమిళ్ వెర్షన్ లో కూడా హైదరాబాద్ లోనే కథ జరుగుతుందని చూపించాను. చెన్నై లో కథ జరుగుతుందని హైదరాబాద్ లొకేషన్స్ చూపించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే తమిళ్ వెర్షన్ కోసం కథలో ఎలాంటి మార్పులు చేయకుండానే సినిమాను తెరకెక్కించాను.

 

క్లైమాక్స్ ఎప్పుడూ ఎండింగ్ లోనే

ఓ సినిమాను ఎక్కడి నుంచైనా షూటింగ్ మొదలు పెట్టొచ్చు.. దానికి ఎలాంటి రూల్స్ లేవు… కానీ ఏ పార్ట్ నుంచి మొదలు పెట్టిన క్లైమాక్స్ అనేది మాత్రం ఎండింగ్ లోనే షూట్ చేయాలనేది నా ఉద్దేశ్యం. నిజానికి నా సినిమాల్లో క్లైమాక్స్ బలంగా చెప్పాలనుకుంటాను. ముందే క్లైమాక్స్ తీసేస్తే ఆ తర్వాత ఏదైనా మార్పు చేయాలనుకున్నా.. కథను బట్టి ఇంకా డెప్త్ గా షూట్ చేయాలనుకున్నా చేయలేం.. అందుకే ఈ సినిమా క్లైమాక్స్ కూడా చివరిలోనే తెరక్కించాం.

 

వెంటనే ఎస్.జె. సూర్య గారిని సంప్రదించాను

ఈ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే..సినిమాలో విలన్ ఫిజికల్ గా కాకుండా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి అనుకున్నాను. ఇక ఎవరైతే బాగుంటుందా అనుకుంటుండగా సూర్య గారు గుర్తొచ్చారు.. వెంటనే ఆయనను సంప్రదించి క్యారెక్టర్ గురించి చెప్పాను. ఆయన వెంటనే ఓకే చెప్పి ఈ క్యారెక్టర్ చేశారు. సినిమా స్టార్టింగ్ నుంచే హీరోకి విలన్ కి మధ్య ఇంట్రెస్టింగ్ వార్ జరుగుతూనే ఉంటుంది..కానీ ఇద్దరు ఎదురయ్యేది మాత్రం క్లైమాక్స్ లోనే. ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ లో ఇంటరెస్ట్ కలిగిస్తూ ఎంటర్టైన్ చేస్తాయి.

 

 

సినిమాలో మెయిన్ హైలైట్స్ అవే…

సినిమాలో మహేష్ – సూర్య మధ్య వచ్చే సీన్స్ , దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఉండే రాక్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ లో వచ్చే రోలర్ కోస్టర్ ఫైట్, క్లైమాక్స్ సినిమాకు మేజర్ హైలైట్స్. ఈ ఎపిసోడ్స్ ఆడియన్స్ విపరీతంగా ఎంటర్టైన్ చేస్తాయి.

 

క్లైమాక్స్ దాదాపు మూడు లొకేషన్స్ లో షూట్ చేశాం

క్లైమాక్స్ ను చెన్నై, హైదరాబాద్ లో మూడు లొకేషన్స్ లో షూట్ చేశాం. క్లైమాక్స్ సినిమాకు చాలా ఇంపార్టెంట్ అందుకే చాలా జాగ్రత్తగా షూట్ చేశాం. విలన్, హీరో ఎదురయ్యేది అక్కడే కాబట్టి చాలా గ్రాండియర్ గా ప్లాన్ చేసి షూట్ చేశాం.

దాదాపు 90 రోజులు నైట్ షూట్ చేశాం

ఇంటెలిజెన్స్ తో నడిచే కథ కాబట్టి ఆల్మోస్ట్ నైట్ సీన్స్ ఎక్కువ.. దాదాపు 90 రోజులు రాత్రే షూట్ చేసాం.. అందుకే సినిమా అంతా ఎక్కువగా నైట్ ఎఫెక్టులోనే కనిపిస్తుంది. మహేష్ వంటి స్టార్ అన్ని రోజులు నైట్ అంతా మాతో పాటే ఉంటూ వర్క్ మీద ఫ్యాషన్ తో వర్క్ చేయడం చాలా ఎగ్జైట్ గా అనిపించింది.

 

బ్యాగ్రౌండ్ స్కోర్ మేజర్ హైలైట్

హారీస్ ఇప్పటికే మంచి ఆల్బమ్ ఇచ్చాడు.. సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్ తో పాటే ఎక్స్ట్రాడినరీ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చి సినిమాను మరో రేంజ్ కి తీసుకెళ్లారు. సినిమా చూసాక హారీస్ బ్యాగ్రౌండ్ స్కోర్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఆ రేంజ్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఉంటుంది.

 

నేను మహేష్ కలిసి ఫ్రెండ్లీ గా చేసిన సినిమా

మహేష్ గారికి నాకు వయసులో పెద్దగా డిఫరెన్స్ లేకపోవడంతో ఒక ఫ్రెండ్లీ నేచర్ తోనే కలిసి పని చేశాం. పదేళ్ల నుంచి ఆయనతో పనిచేయాలనుకున్నాను.. కానీ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడూ చేస్తానా..అని అనిపిస్తుంది.. దానికి కారణం మహేష్ గారి ఫ్రెండ్లీ నెస్ , డైరెక్టర్ కి ఆయన ఇచ్చే రెస్పెక్టే.. జెనెరల్ గా స్టార్ హీరో అంటే కొంచెం లోపల భయ భయం ఉంటుంది.. కానీ ఎలాంటి భయం లేకుండానే సూపర్ స్టార్ తో ఈ సినిమా చేసాను.

 

అవుట్ ఫుట్ ఎక్స్ట్రాడినరీ గా వచ్చింది

స్పైడర్ రేపే రిలీజ్ అవుతుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. దానికి ఒకే ఒక్క రీజన్ ఫైనల్ అవుట్ ఫుట్ ఎక్స్ట్రాడినరీ గా రావడమే.. సినిమా చూస్తుంటే మాకే చాలా ఎగ్జైటింగ్ ఇంటరెస్టింగ్ అనిపిస్తుంది. రేపు కచ్చితంగా ఆడియన్స్ లో కూడా అదే ఫీల్ కలిగి సినిమా బాగా ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాం.

 

ఆ వార్తలో నిజం లేదు

ఈ సినిమా కథ ముందుగా ప్రభాస్ కి చెప్పాననే వార్తలో నిజం లేదు. ఈ సినిమా కి ముందు ప్రభాస్ తో ఫ్రెండ్లీ గా ఒకే ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడానంతే. ఈ కథను మహేష్ కి తప్ప మారేహీరోకీ చెప్పలేదు. కథ అనుకోగానే నా మైండ్ లో స్ట్రైక్ అయినా ఒక ఒక్కడు మహేష్.

 

రజిని కాంత్ తో త్వరలోనే…

ఇటీవలే రెండు మూడు సార్లు రజిని సార్ ను కలిశాను.. స్క్రిప్ట్ చెప్పాను.. ఆయన కూడా సానుకూలంగానే స్పందించారు. ఎప్పుడూ అనేది చెప్పలేను కానీ త్వరలోనే ఆయనతో సినిమా చేస్తా.