AR మురుగదాస్ బర్త్ డే స్పెషల్

Monday,September 25,2017 - 02:19 by Z_CLU

సిల్వర్ స్క్రీన్ పై సంచలనం సృష్టించడం AR మురుగదాస్ కి అలవాటు. ప్రేక్షకుడు కనీసం ఎక్స్ పెక్ట్ కూడా చేయని ఇమోషన్స్ కి, హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని మ్యాచ్ చేసి బ్లాక్ బస్టర్స్ ని జెనెరేట్ చేయడమంటే ఆయనకు చాలా సరదా. 25 సెప్టెంబర్ 1974 లో కళ్ళకురిచి గ్రామంలో, తమిళనాడులో పుట్టిన AR మురుగదాస్ పూర్తి పేరు అరుణాచలం మురుగదాస్. ఈ నెల 27 న రిలీజ్ కి రెడీగా ఉన్న ‘స్పైడర్’ సినిమాతో సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్న ఈ సెన్సేషనల్ డైరెక్టర్ ఈ రోజు తన 43 వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా జీ సినిమాలు స్పెషల్ స్టోరీ.

 

తమిళనాట ‘ధీన’ సినిమాతో డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టుకున్న AR మురుగదాస్, ‘గజిని’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ని సెట్ చేశాడు. ఆ తరవాత మెగాస్టార్ చిరంజీవి ‘స్టాలిన్ ‘ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. విజువల్ వండర్స్ ని క్రియేట్ చేయడంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాని మురుగదాస్, బాలీవుడ్ లోను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు.

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ హిట్ గ్యారంటీ సినిమాలు చేస్తూ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుని సరికొత్త డైమెన్షన్ లో ప్రెజెంట్ చేస్తున్న స్పైడర్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి రీచ్ కానున్న సెన్సేషనల్ డైరెక్టర్ AR మురుగదాస్ మరెన్నో హైట్స్ కి రీచ్ అవ్వాలని, ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో  జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది జీ సినిమాలు.