నిశ్శబ్దం రిలీజ్ డేట్

Monday,December 02,2019 - 04:02 by Z_CLU

అనుష్క లీడ్ రోల్ పోషిస్తున్న మూవీ నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. జనవరి 31న నిశ్శబ్దం మూవీ థియేటర్లలోకి వస్తుంది. ఈ రోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు.

రెండేళ్ల కిందటొచ్చిన భాగమతి తర్వాత పూర్తిస్థాయిలో అనుష్క నుంచి వస్తున్న సినిమా ఇదే. రీసెంట్ గా వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఆమె కనిపించినప్పటికీ, అది గెస్ట్ ఎప్పీయరెన్స్ మాత్రమే. అందులో ఆమె హీరోయిన్ కాదు.

మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో సాక్షి అనే మూగ అమ్మాయి పాత్రలో కనిపిస్తోంది అనుష్క. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మాధవన్, అంజలి, సుబ్బరాజు, షాలినీ పాండే, అవసరాల.. ఇలా ఎంతోమంది స్టార్స్ ఈ సినిమాలో నటించారు. వాళ్లందరి లుక్స్ ను మినిమం గ్యాప్స్ లో విడుదల చేస్తూ, సినిమాపై క్యూరియాసిటీ పెరిగేలా చేస్తోంది యూనిట్.

ఈ సినిమాకు కోన వెంకట్ స్కీన్ ప్లే-డైలాగ్స్ అందించాడు. కథ మాత్రం హేమంత్ మధుకర్ దే. గోపీసుందర్ సంగీత దర్శకుడు. పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. కోనవెంకట్ సహ-నిర్మాతగా వ్యవహరించాడు.