భాగమతి టీజర్ రివ్యూ

Wednesday,December 20,2017 - 11:50 by Z_CLU

ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న భాగమతి సినిమా టీజర్ ఎట్టకేలకు రిలీజైంది. ఫస్ట్ లుక్ తో ఇప్పటికే హల్ చల్ చేసిన ఈ మూవీ.. టీజర్ తో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసింది. ఈ సినిమా జానర్ పై ఇన్నాళ్లూ జరిగిన ప్రచారానికి టీజర్ తో చెక్ పెట్టారు. పక్కా హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది భాగమతి సినిమా.

బాహుబలి-2 తర్వాత అనుష్క నుంచి వస్తున్న సినిమా కావడంతో భాగమతిపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టీజర్ రిలీజైంది. ఈ సినిమా కోసం భారీ భవంతి సెట్ వేశారు. ఆ భవంతినే టీజర్ లో చూపించారు. అనుష్క చేతికి మేకు కొట్టిన స్టిల్ ను ఫస్ట్ లుక్ లో చూపించారు. ఈ టీజర్ లో అనుష్క తనకు తానే చేతిలో మేకు కొట్టుకోవడం చూపించారు. టీజర్ లో హైప్ ఎలిమెంట్ ఇదే.

జి.అశోక్ దర్శకత్వంలో తెరకెక్కింది భాగమతి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ఉన్ని కృష్ణన్, జయరాం కీలక పాత్రలు పోషించారు. జనవరి 26న థియేటర్లలోకి రానుంది భాగమతి.