కేర‌ళ ప్రమెష‌న్ లో భాగ‌మ‌తి టీం

Wednesday,January 24,2018 - 12:02 by Z_CLU

 అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం ట్రైలర్ తొ స‌హ అన్ని ప్ర‌మెష‌న‌ల్ మెటిరియ‌ల్స్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి అనూహ్యమైన స్పంద‌న వ‌చ్చింది.  అశోక్  దర్శకుడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశి, ప్ర‌మెద్‌, విక్ర‌మ్ లు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

సౌత్ ఇండియాలో మెత్తం గా అన్ని భాష‌ల్లో జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్బంగా చెన్నైలో ఆడియో రిలీజ్, హైద‌రాబాద్ లొ ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ చేసిన విష‌యం తెలిసిందే.. ఇప్పుడు కేర‌ళ లో కూడా ప్ర‌మెష‌న్ ని ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేశారు.

కేర‌ళ ప్ర‌మెష‌న్స్ కి నిర్మాత‌లు ప్ర‌మెద్‌, విక్ర‌మ్ లు, ద‌ర్శ‌కుడు అశోక్‌, హీరోయిన్ అనుష్క‌, ఉన్ని ముకుంద‌న్ లు హ‌జ‌ర‌య్యారు. బాహుబలి-2 సినిమా కేరళలో కూడా సూపర్ హిట్ అవ్వడంతో, ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని అనుష్క నటించిన భాగమతిని అక్కడ విడుదల చేస్తున్నారు. దీనికి తోడు ఎక్కువమంది మలయాళ నటులు కూడా భాగమతిలో నటించడం ఈ సినిమా కేరళ రిలీజ్ కు మరో ప్లస్ పాయింట్.

అనుష్క నటన, దర్శకుడు అశోక్ టేకింగ్, మథి కెమెరా వర్క్, అబ్బుర పరిచే రవీందర్ ఆర్ట్ వర్క్, తమన్ రీ రికార్డింగ్, నిర్మాణాత్మక విలువలు ఈ సినిమాకు హైలెట్స్.

 

నటీనటులు – అనుష్క, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, దేవ దర్శిని, తలైవాసల్ విజయ్, అజయ్ ఘోష్, మధు నందన్

సంగీతం – ఎస్.ఎస్.తమన్

సినిమాటోగ్రాఫర్ – మథి

పి ఆర్ ఓ– ఏలూరు శ్రీను

ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వరరావ్

ప్రొడక్షన్ డిజైనర్ – రవీందర్

నిర్మాతలు – వంశీ – ప్రమోద్-విక్ర‌మ్‌

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – అశోక్