భాగమతిపై పెరుగుతున్న క్రేజ్

Tuesday,January 23,2018 - 10:39 by Z_CLU

ఈ వీకెండ్ సోలోగా థియేటర్లలోకి వస్తోంది భాగమతి. అభిమన్యుడు, మనసుకు నచ్చింది సినిమాలతో పాటు తాజాగా ఆచారి అమెరికా యాత్ర సినిమా కూడా వాయిదా పడ్డంతో.. భాగమతికి సోలో రిలీజ్ దక్కింది. పైగా ఈ సినిమాకు సంబంధించి ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరైన అనుష్క, భాగమతిలో డిఫరెంట్ లుక్ లో కనిపించనుంది. పైగా ఇది హారర్ సబ్జెక్ట్ కావడంతో అనుష్క విశ్వరూపం ఉంటుందని ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం అనుష్క ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది. ఏడాది పాటు కష్టపడింది.

కేవలం కథపై నమ్మకంతో భారీ బడ్జెట్ తో భాగమతి సినిమాను తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు అశోక్ దర్శకత్వం వహించాడు. తమన్ సంగీతం అందించాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలోకి రానుంది భాగమతి.