Anushka Shetty, Naveen Polishetty New Movie regular shoot from April 4
ఇక సినిమాలు చేయదనుకున్నారు. ఓ బిజినెస్ మేన్ తో పెళ్లయిపోతుందని పుకార్లు పుట్టించారు. బరువు తగ్గలేక సినిమాలకు దూరమైందంటూ స్టోరీలు అల్లేశారు. అన్నింటికీ చెక్ పెడుతూ సెట్స్ పైకి వస్తోంది అనుష్క. రేపు సోమవారం నుంచి కొత్త సినిమాను స్టార్ట్ చేయబోతోంది.

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క, లేటెస్ట్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో యు.వి.క్రియేషన్స్ ఓ సినిమా అనౌన్స్ చేశారు. ఇది అనుష్కకు 48వ సినిమా. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేసింది ఈ బ్యూటీ. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి.. 2018లో లేడీ ఓరియెంటెడ్ భాగమతి సినిమాలను యు.వి.క్రియేషన్స్ నిర్మించారు. ఈ రెండు సినిమాలు మంచి విజయాలు సాధించాయి.

ఇప్పుడు మూడోసారి అనుష్క యు.వి.క్రియేషన్స్ కలిసి సినిమా చేస్తున్నారు. నవీన్ పొలిశెట్టి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. దర్శకుడు మహేష్ బాబు న్యూ ఏజ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపు (ఏప్రిల్ 4) నుంచి మొదలు కానుంది. అనుష్క అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఏ మాత్రం హడావిడి లేకుండా షూటింగ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనుంది అనుష్క. ఇంకా పేరుపెట్టని ఈ సినిమాకు సంగీత దర్శకుడ్ని ఫిక్స్ చేయలేదు.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics