అనుష్కకిది మరో చాలెంజ్

Wednesday,September 11,2019 - 12:39 by Z_CLU

అనుష్క ‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్ రిలీజయింది. సినిమాలో అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా కనిపించనుంది. ఈ సినిమా టైటిల్ ని  గతంలోనే  అనౌన్స్ చేసిన మేకర్స్, ఈ రోజు ఈ పోస్టర్ తో పాటు అనుష్క క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనేది రివీల్ చేశారు. షార్ట్ హెయిర్ లుక్స్ లో కాన్వాస్ పై పెయింట్ చేస్తూ కొత్తగా కనిపిస్తుంది అనుష్క.

‘నిశ్శబ్దం’ కథ ఏంటనేది ఇప్పటికీ సస్పెన్సే.. కానీ సినిమాలో అనుష్క పేరు ‘సాక్షి’ ని బట్టి, సినిమాలో జరిగే ఒక ఇన్సిడెంట్ కి అనుష్క క్యారెక్టర్ కనెక్ట్ అయి ఉంటుందని తెలుస్తుంది. దానికి తోడు క్యారెక్టర్ కి ఉండబోయే స్పెషల్ క్వాలిటీస్, సినిమాలో మరిన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని జెనెరేట్ చేస్తాయనిపిస్తుంది. ఇవన్నీ గమనిస్తే అనుష్కకి ఇప్పటికే ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేసిన అనుభవం ఉన్నా, ‘నిశ్శబ్దం’ మాత్రం అనుష్క కరియర్ లోనే మోస్ట్ చాలెంజింగ్ క్యారెక్టర్ అనిపిస్తుంది.

 

ఈ సినిమాలో శాలినీ పాండే, అంజలి, మాధవన్ కీ రోల్స్ లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , KFC బ్యానర్స్ పై TG విశ్వ ప్రసాద్ , కోన వెంకట్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హేమంత్ ఈ సినిమాకి డైరెక్టర్.