‘నిశ్శబ్దం’ రిలీజ్ డేట్ మారింది

Saturday,January 25,2020 - 10:01 by Z_CLU

లెక్క ప్రకారం మరో వారం రోజుల్లో సినిమా థియేటర్స్ లో ఉండాలి. కానీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ ని పోస్ట్ పోన్ చేశారు ‘నిశ్శబ్దం’ మేకర్స్. శివరాత్రి కానుకగా సినిమాని ఫిబ్రవరి 20 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు.

పర్ఫామెన్స్ ఓరియంటెడ్ కథల్ని ఎంచుకుంటున్న అనుష్క నుండి ‘భాగమతి’ తరవాత ఇమ్మీదియాట్ గా ఇంకో సినిమా కాలేదు. అందునా రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ లో కాకుండా, ఈ సినిమాలో మ్యూట్ ఆర్టిస్ట్ గా కనిపించనుంది. ఎక్స్ ట్రీమ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రోజురోజుకి ఆడియెన్స్ లో క్యూరియాసిటీ జెనెరేట్ చేస్తుంది.

ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలినీ పాండే కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి  హేమంత్ మధుకర్ దర్శకుడు.