అనుష్క ‘నిశ్శబ్దం’ – ప్రతీది ప్రత్యేకం

Tuesday,December 03,2019 - 09:03 by Z_CLU

మర్డర్ మిస్టరీస్ టాలీవుడ్ కి కొత్త కాదు. కానీ అనుష్క ‘నిశ్శబ్దం’ మాత్రం కాస్త డిఫెరెంట్ అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సినిమాలోని క్యారెక్టర్స్ ఒక్కొక్కటి దేనికదే ప్రత్యేకం అనిపిస్తుంది. దానికన్నా ఆ క్యారెక్టర్స్ కి ఉన్న ప్రత్యేకతల వల్ల సినిమా మరింత లైమ్ లైట్ లోకి వస్తుంది.

అనుష్క  మ్యూట్ ఆర్టిస్ట్ :  పేరు సాక్షి… ఇంతే ఇప్పటి వరకు మేకర్స్ రివీల్ చేసిన ఇన్ఫర్మేషన్. కానీ సినిమాలోని మిస్టరీ బ్రేక్ అయ్యేది మాత్రం ఈ క్యారెక్టర్ తోనే. అనుష్క ఇలాంటి క్యారెక్టర్స్ ఇప్పటి వరకు ప్లే చేయలేదు అనేది ఎంత ఇంట్రెస్టింగ్ పాయింటో… ఒక మ్యూట్ ఆర్టిస్ట్ మర్డర్ మిస్టరీ రివీల్ అవ్వడంలో ఎలా సపోర్టింగ్ పిల్లర్ అయిందనేది మరింత ఇంట్రెస్టింగ్ కానుంది.

మాధవన్ – సెలెబ్రిటీ మ్యూజీషియన్ : ఆంటోని పేరు… ఈ సినిమా నుండి మాధవన్ కి సంబంధించి ఏ స్టిల్ బయటికి వచ్చినా, చేతిలో గిటార్ తోనే కనిపిస్తున్నాడు. దానికి తోడు మోస్ట్ స్టైలిష్ అండ్ మెచ్యూర్డ్ లుక్స్ లో కనిపిస్తున్నాడు. సినిమాలో ‘సాక్షి’ తో ఎక్కువగా కనెక్ట్ అయి ఉండే క్యారెక్టర్ ఇదే…

షాలినీ పాండేవాయిస్ ఆఫ్ సాక్షి : పేరు సోనాలి… అనుష్క క్యారెక్టర్ ఏం చెప్పాలనుకున్నా కన్వే చేసేది ఈ క్యారెక్టరే. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ రాలేదు. ఈ క్యారెక్టర్ ని మేకర్స్ ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారనే క్యూరియాసిటీ ఆడియెన్స్ లో ఉంది.

అంజలి : ఇలాంటి క్యారెక్టర్స్ చాలా సినిమాల్లో చూశాం కానీ అంజలిని ఇలాంటి పవర్ ఫుల్ రోల్ లో చూడలేదు. మర్డర్ మిస్టరీని చేధించే ప్రాసెస్ లో కీ రోల్ ప్లే చేసేది ఈ క్యారెక్టరే…

సుబ్బరాజు – వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ :పేరు వివేక్… సపోర్టింగ్ రోల్స్ చేయడం సుబ్బరాజుకి కొత్త కాదు. కానీ పర్టికులర్ గా ఈ క్యారెక్టర్ ని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా ప్రెజెంట్ చేస్తున్నారంటే సాదా సీదా క్యారెక్టర్ అయితే అస్సలు కాదు… చూడాలి… ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అనుమానాస్పదంగా జరిగిన ఈ మర్డర్ కి ఎలా కనెక్ట్ అవుతాడో…