బాలీవుడ్ దృష్టిలో అనుష్క

Saturday,October 19,2019 - 10:02 by Z_CLU

బాలీవుడ్ దృష్టిలో పడింది అనుష్క. అలాగని హిందీ సినిమా డెబ్యూ ప్లానింగ్ లో ఉందని కాదు. బాలీవుడ్ దృష్టి అనుష్క నటించిన సినిమాలపై ఉంది. వరసగా అనుష్క సినిమాలు రీమేక్ చేయడానికి బాలీవుడ్ లో రోజు రజుకి డిమాండ్ పెరుగుతుంది.

రీసెంట్ గా అనుష్క ‘అరుంధతి’ రీమేక్ కి రెడీ అవుతుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అనుష్క కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుందనే టాక్ కూడా గట్టిగానే నడిచింది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది ఇంకా తెలియాల్సి ఉంది ఈ లోపు అనుష్క నటించిన ‘భాగమతి’ పేరు బి టౌన్ లో వినిపిస్తుంది.

భాగమతి రీమేక్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ‘భాగమతి’ గా భూమి పెడ్నేకర్ కన్ఫమ్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించి మిగతా విషయాలు ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. అయితే అనుష్క సినిమాలకు బాలీవుడ్ లో పెరుగుతున్న డిమాండ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నిన్నా మిన్నటి వరకు విజయ్ దేవరకొండ ఒక్కడే బాలీవుడ్ దృష్టిలో ఉండేవాడు. ‘కబీర్ సింగ్’ సక్సెస్ అయ్యేసరికి విజయ్ దేవరకొండ చేసే ప్రతి సినిమా బాలీవుడ్ అబ్జర్వేషన్ లో ఉంటుంది. ఇప్పుడు అనుష్క సినిమాలకు కూడా అదే స్థాయిలో డిమాండ్ పెరుగుతుంది.