'నిశ్శబ్ధం' అంటున్న అనుష్క

Sunday,July 21,2019 - 09:20 by Z_CLU

‘భాగమతి’ తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాకు ‘నిశ్శబ్ధం’ అనే టైటిల్ ను ఖరారు చేసారు.  అనుష్క ఇండస్ట్రీలో  14 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ టైటిల్ తో పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. హేమంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మాధవన్, శాలినీ పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , KFC బ్యానర్స్ పై TG విశ్వ ప్రసాద్ ,కోనా వెంకట్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.