ఎట్టకేలకు అనుష్క నుంచి మరో సినిమా

Saturday,August 25,2018 - 01:12 by Z_CLU

భాగమతి తర్వాత మళ్లీ మరో సినిమా చేయని అనుష్క, ఎట్టకేలకు కొత్త సినిమాకు సైన్ చేసింది. అనుష్క లీడ్ రోల్ లో ఓ సినిమా రాబోతోంది. భాగమతి టైపులో ఇది కూడా థ్రిల్లర్ సినిమానే. దీనికి సైలెంట్ అనే పేరుపెట్టారు. కోన వెంకట్ దర్శకత్వం వహించబోతున్నాడు.

ఈ సినిమాతో అనుష్కకు జోడీగా మాధవన్ నటించబోతున్నాడు. తెలుగులో సవ్యసాచి సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన మాధవన్.. సైలెంట్ సినిమాలో మరో కీలక పాత్ర పోషించబోతున్నాడు. గతంలో 13-B లాంటి థ్రిల్లర్ లో నటించిన అనుభం మాధవన్ కు ఉంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది అనుష్క-మాధవన్ సినిమా.