స్లిమ్ లుక్ తో అదరగొట్టిన స్వీటీ

Monday,February 11,2019 - 05:49 by Z_CLU

ఒక్కసారిగా అందరికీ స్వీట్ షాక్ ఇచ్చింది అనుష్క. మొన్నటివరకు బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా సన్నబడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. స్లిమ్ లుక్ లో అనుష్క దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాహుబలి-2 టైమ్ లో కాస్త లావుగా కనిపించింది అనుష్క. ఆ మూవీ తర్వాత చేసిన భాగమతిలో కూడా అనుష్క లుక్ లో పెద్ద మార్పులు కనిపించలేదు. అయితే ఈమధ్య కాలంలో అనుష్క ఇంకాస్త లావెక్కింది. దీంతో ఆమె తన ఫిజిక్ పై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. విదేశాలకు వెళ్లి కొన్ని నెలల్లో ఇలా స్లిమ్ గా తయారైంది.

చాలామంది హీరోయిన్లలా అనుష్క జిమ్ బాట పట్టలేదు. అలాగని లైపో ల్లాంటి సర్జరీల జోలికి కూడా వెళ్లలేదు. పూర్తి సహజసిద్ధమైన పద్ధతులు పాటించడంతో పాటు రెగ్యులర్ గా యోగా చేసి ఇలా స్లిమ్ అయింది. ఈ కొత్త మేకోవర్ తోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది.

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో సైలెన్స్ అనే థ్రిల్లర్ మూవీ చేయబోతోంది అనుష్క. మాధవన్, షాలినీ పాండే, అంజలి ఇందులో కీలక పాత్రలు పోషించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ పైకి రానుంది.