జనవరి సెంటిమెంట్ తో అనుష్క...

Tuesday,December 03,2019 - 10:03 by Z_CLU

అనుష్క ‘నిశ్శబ్దం’ హడావిడి స్టార్ట్ అయింది. సరిగ్గా ఏడాది తర్వాత అనుష్క సినిమా రిలీజవుతుంది. అయితే ఈసారి కూడా జనవరి మిస్ అవ్వనివ్వలేదు అనుష్క. యథావిధిగా జనవరి సెంటిమెంట్ నే కంటిన్యూ చేసింది.

బాహుబలి తరవాత స్పీడ్ తగ్గించిన అనుష్క, భాగమతి తరవాత మళ్ళీ సెట్స్ పైకి రావడానికే ఎక్కువ టైమ్ తీసుకుంది. ఈసారి అనుష్క ఏ స్టార్ సరసన కనిపించనుంది…? ఎలాంటి సినిమా చేయనుంది..? లాంటి స్పెక్యులేషన్స్ మధ్య ‘నిశ్శబ్దం’ సినిమా అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్స్ రిలీజయినపుడే ఈ సారి కూడా అనుష్క రెగ్యులర్ సినిమాలో చెయ్యట్లేదు అనే క్లారిటీ ఇచ్చేసింది.

రిపబ్లిక్ డే సందర్భంగా లాస్ట్ ఇయర్ ‘భాగమతి’ తో మెస్మరైజ్ చేసిన అనుష్క, ఈసారి జనవరి దాటనీయలేదు. జనవరి 31 న థియేటర్స్ లోకి ‘నిశ్శబ్దం’ గా ఎంటరవుతున్న స్వీటీ, బాక్సాఫీస్ దగ్గర డెఫ్ఫినెట్ గా మోత మోగిస్తుందనే కాన్ఫిడెన్స్ తో ఉంది.

రెగ్యులర్ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాల్లా కాకుండా స్టైలిష్ మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా, భాగమతి తరహాలోనే సక్సెస్ అందుకోవాలి కానీ, ఇక నుండి ప్రతి జనవరికి ఖచ్చితంగా ఓ సినిమా రిలీజయ్యేలా చూసుకునే అవకాశాలున్నాయి.